హైదరాబాద్: 28°C
తెలంగాణ

కార్తీక దీపం వెలిగించిన MLA హరీష్ బాబు

ASF: కాగజ్ నగర్ పట్టణంలోని సర్ సిల్క్‌లో గల లక్ష్మీనారాయణ మందిరంలో కార్తీక పౌర్ణమి సందర్భంగా MLA హరీష్ బాబు కార్తీక దీపం వెలిగించి కోనేటిలో విడిచారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. శివకేశవులు అబేధ్యమని, శివకేశవుల ఆరాధనకు కార్తీక మాసం అత్యంత ప్రీతికరమైన మాసమని తెలిపారు. కార్యక్రమంలో స్థానిక బీజేపీ నాయకులు, భక్తులు పాల్గొన్నారు.