BHNG: కార్తీక పౌర్ణమి సందర్భంగా యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి భక్తులు భారీగా తరలివచ్చారు. మంగళవారం రోజు సుమారు 70 వేల మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నట్టు ఆలయ నిర్వాహకులు తెలిపారు. 2,410 సత్యనారాయణ స్వామి వ్రతాలు నిర్వహించగా, ప్రధాన ఆలయంలో 2,150, పాతగుట్ట ఆలయంలో 260 వ్రతాలు జరిగినట్లు ఆలయ అధికారులు వెల్లడించారు.
తెలంగాణ
యాదాద్రిలో ఒక్కరోజే 70 వేల మంది భక్తులు!


