JN: రఘునాథపల్లి మండలంలో రాత్రి వర్షం కురిసింది. ప్రస్తుతం వరి కోతలు, నూర్పిళ్ల సమయం కావడంతో అన్నదాతలకు తీవ్ర ఇబ్బందికరంగా మారింది. కల్లాల్లో, రోడ్లపై ఆరబోసిన వరి ధాన్యం తడిసిపోయే ప్రమాదం ఉండటంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. అకాల వర్షం వల్ల ధాన్యం రంగు మారి నాణ్యత దెబ్బతినే అవకాశం ఉందని, పంటను కాపాడుకునేందుకు నానా తంటాలు పడుతున్నామని రైతులు వాపోతున్నారు.
తెలంగాణ
వరికోతల సమయంలో వర్షం


