KMR: బీబీపేట నుండి ఇస్సానగర్ వెళ్లే రోడ్డు ప్రమాదకరంగా మారింది. మార్గంలో పెద్ద చెరువు కట్ట కింద ఉన్న తారు రోడ్డు పూర్తిగా గుంతలు పడడంతో ప్రయాణికులు అవస్థలు పడుతున్నారు. ఈ రోడ్డు గుండా అంతర్ జిల్లాలైన మెదక్, సిద్దిపేట జిల్లాలకు చెందిన ప్రజలు అధిక సంఖ్యలో ప్రయాణిస్తూ ఉంటారు. గతంలో ప్రమాదాలు జరిగిన సంఘటనలు కూడా ఉన్నాయి. రోడ్డుకు మరమ్మత్తులు చేపట్టాలని ప్రజలు వేడుకుంటున్నారు.
తెలంగాణ
గుంతలమయంగా బీబీపేట–ఇస్సానగర్ రోడ్డు!


