హైదరాబాద్: 28°C
తెలంగాణ

నిట్ ప్రొఫెసర్‌కు మురళీమనోహర్ జోషి అవార్డు

WGL: నిట్ వరంగల్ ఈసీఈ విభాగం ప్రొఫెసర్, అంతర్జాతీయ సంబంధాలు, పూర్వ విద్యార్థుల వ్యవహారాల డీన్ టి. కిశోర్ కుమార్‌కు ప్రతిష్ఠాత్మక డాక్టర్ మురళీమనోహర్ జోషి అవార్డు–2026 లభించింది. సైన్స్ అండ్ టెక్నాలజీ విభాగంలో ఈ అవార్డును ఈ నెల 22న న్యూడిల్లీలో జరిగిన 9వ ఎఫ్‌డబ్ల్యూఏ వార్షిక సదస్సులో పద్మవిభూషణ్ డాక్టర్ మురళీమనోహర్ జోషి చేతుల మీదుగా అందుకున్నారు.