హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: నారాయణఖేడ్‌లో జ్వాలాతోరణం వేడుక

SRD: నారాయణఖేడ్ పట్టణంలోని పురాతన శ్రీ కాశీనాథ మందిరంలో మంగళవారం రాత్రి జ్వాలాతోరణం వేడుక అత్యంత వైభవంగా జరిగింది. స్థానిక ఎమ్మెల్యే పట్లోళ్ల సంజీవరెడ్డి, ఆయన సతీమణి అనుపమ రెడ్డి ఈ కార్యక్రమంలో పాల్గొని శాస్త్రోక్తంగా జ్వాలాతోరణాన్ని వెలిగించారు. పండితుడు గురురాజ శర్మ వేదమంత్రోచ్ఛారణల నడుమ ప్రత్యేక పూజలు నిర్వహించారు.