హైదరాబాద్: 28°C
తెలంగాణ

కానాయపల్లిలో ఘనంగా జ్వాలాతోరణం

WNP: కార్తీకమాస పౌర్ణమి సందర్భంగా మంగళవారం రాత్రి కొత్తకోట మండలం కానాయపల్లి శ్రీకోటిలింగేశ్వరదత్త దేవస్థానంలో జ్వాలాతోరణం కార్యక్రమం వైభవంగా జరిగింది. అర్చకులు వేదమంత్రాలతో సంకల్పపూజలు నిర్వహించారు. అనంతరం మహామంగళహారతి సమర్పించి జ్వాలాతోరణం వెలిగించారు. భక్తులు భక్తిశ్రద్ధలతో శివపంచాక్షరీ మంత్రం ఓంనమఃశ్శివాయ స్మరిస్తూ జ్వాలాతోరణం కింద నుంచి నడిచారు.