ప్రతిరోజూ ఆహారంలో ఆకుకూరలను చేర్చుకోవడం వల్ల శరీరానికి అవసరమైన విటమిన్లు అందుతాయి. ఇందులో ఉండే ఐరన్ రక్తహీనతను తగ్గించి రక్తాన్ని శుద్ధి చేస్తుంది. పీచు పదార్థం ఎక్కువగా ఉండటం వల్ల జీర్ణక్రియ మెరుగుపడి మలబద్ధకం తగ్గుతుంది. కంటి చూపు మెరుగుపడటంతో పాటు రోగనిరోధక శక్తి కూడా బలపడుతుంది. అందుకే వారంలో కనీసం మూడు సార్లైనా ఆకుకూరలు తినడం అలవాటు చేసుకోండి.
ఆరోగ్యం
ఆకుకూరలు తింటే ఈ వ్యాధులకు చెక్..!


