వెన్నుపూస డిస్క్ జారి సయాటిక్ నరం ఒత్తిడికి గురైతే సయాటికా వస్తుంది. దీంతో నడుము నుంచి పిరుదులు, తొడల మీదుగా కాళ్ల వరకు తీవ్ర నొప్పి వ్యాపిస్తుంది. సాధారణంగా ఒకవైపు తిమ్మిర్లు, సూదులతో గుచ్చినట్లు ఉండటం, కాలు బలహీనపడటం దీని లక్షణాలు. ఎక్కువసేపు కూర్చోవడం, అధిక బరువులు ఎత్తడం దీనికి కారణాలు. సరైన భంగిమ, తేలికపాటి వ్యాయామాలతో ఉపశమనం పొందవచ్చు. సమస్య తీవ్రమైతే వైద్యుడిని సంప్రదించాలి.
ఆరోగ్యం
సయాటికా సమస్య వేధిస్తోందా?


