హైదరాబాద్: 28°C
తెలంగాణ

పేదలకు ఉచిత కంటి వైద్య శిబిరం

రంగారెడ్డి: కేశంపేట మండలం లేమామిడిలో ఎన్నారై గోగు వెంకట్ నారాయణరెడ్డి ఆధ్వర్యంలో, శంకర నేత్రాలయ వైద్యుల సహకారంతో ఈ నెల 27 నుంచి డిసెంబర్ 3 వరకు ఉచిత కంటి వైద్య శిబిరం జరగనుంది. శుక్లాల ఆపరేషన్లు, అద్దాలు ఉచితంగా అందిస్తారు. వచ్చేవారు ఆధార్ కార్డు, ఫోన్ నంబర్ తప్పనిసరిగా తేవాలని, ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని నిర్వాహకులు కోరారు.