హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఎమ్మెల్యేకు వినతి పత్రం అందజేసిన ఏఐఎస్ఎఫ్ నాయకులు..

KMM: ఏన్కూర్ నుంచి ఖమ్మం వెళ్లే RTC బస్సు సమయాలను విద్యార్థులకు అనుగుణంగా మార్చాలని AISF నాయకులు కోరారు. మంగళవారం వైరాలో ఎమ్మెల్యే రాందాస్ నాయక్ నివాసంలో ఆయనను కలిసి వినతిపత్రం అందజేశారు. విద్యార్థుల ప్రయాణ ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని బస్సు సమయాలను సవరించాలని విజ్ఞప్తి చేశారు. దీనిపై ఎమ్మెల్యే సానుకూలంగా స్పందించినట్లు ఏఐఎస్ఎఫ్ నాయకులు తెలిపారు.