హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

రాయదుర్గంలో ధరణి బియ్యం కేంద్రం ప్రారంభం

ATP: రాయదుర్గంలోని ధరణి సన్న బియ్యం సరఫరా కేంద్రాన్ని ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు ప్రారంభించారు. పేద, సామాన్య ప్రజలకు తక్కువ ధరకే నాణ్యమైన సన్న బియ్యం అందించాలనే లక్ష్యంతో కూటమి ప్రభుత్వం ఈ పథకాన్ని అమలు చేస్తోందన్నారు. బియ్యం ధరల భారంతో ఇబ్బందులు పడుతున్న కుటుంబాలకు ఈ కేంద్రం ఉపయోగపడుతుందని, అర్హులు సేవలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.