E.G: కార్తీక పౌర్ణమి నదీ స్నానాలకు వచ్చే భక్తులకు అన్ని సౌకర్యాలు కల్పించినట్లు కమిషనర్ రాహుల్ మీనా తెలిపారు. మంగళవారం పుష్కర ఘాట్లో ఏర్పాట్లను నగరపాలక అధికారులతో కలిసి ఆయన పర్యవేక్షించారు. భక్తులతో మాట్లాడి తాగునీరు, మరుగుదొడ్లు, ప్రథమ చికిత్స, లాకర్ సదుపాయాలపై ఆరా తీశారు. ఘాట్ పరిసరాలు ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉంచాలని ఆదేశించారు.
ఆంధ్రప్రదేశ్
పుష్కర ఘాట్లో ఏర్పాట్లను పరిశీలించిన కమిషనర్


