హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పెదపట్నం సర్పంచ్ ఏకగ్రీవం

కోనసీమ: మామిడికుదురు మండలం పెదపట్నం పంచాయతీ సర్పంచ్ కొమ్ముల నందేశ్వరరావు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మొత్తం 12 వార్డుల్లో 7 వార్డులు ఏకగ్రీవం కాగా, 2, 3, 7, 8, 9 వార్డుల సభ్యుల పదవులకు మాత్రమే ఎన్నిక జరగనుంది. సర్పంచ్ పాటు అన్ని వార్డులను ఏకగ్రీవంగా ఎన్నుకోవాలన్న గ్రామస్థుల ప్రయత్నం పూర్తిస్థాయిలో ఫలించలేదు.