హైదరాబాద్: 28°C
ఆరోగ్యం

కళ్ల కింద వాపు తగ్గాలంటే?

సరిపడా నిద్ర లేకపోవడం, రాత్రిపూట ఉప్పు ఎక్కువగా తినడం లేదా స్క్రీన్ ఎక్కువగా చూడటం వల్ల ఉదయం కళ్ల కింద వాపు(Puffy Eyes) కనిపిస్తుంది. దీన్ని తగ్గించడానికి ఉదయం చల్లని నీటితో ముఖం కడుక్కుని, శుభ్రమైన కాటన్ వస్త్రంలో చుట్టిన ఐస్ క్యూబ్ లేదా ఫ్రిజ్‌లో పెట్టిన చల్లని స్పూన్‌ను కళ్ల కింద రెండు నిమిషాలు ఉంచాలి. కీరదోస ముక్కలు లేదా చల్లని గ్రీన్ టీ బ్యాగ్స్ ఉంచినా కళ్లు తక్షణమే తాజాగా కనిపిస్తాయి.