హైదరాబాద్: 28°C
ఆరోగ్యం

టైమ్ లేదని బ్రేక్‌ఫాస్ట్ స్కిప్ చేస్తున్నారా?

ఉదయం హడావుడిలో చాలా మంది బ్రేక్‌ఫాస్ట్ మానేసి ఆఫీసులకు వెళ్తుంటారు. రాత్రి భోజనం తర్వాత దాదాపు 10 గంటల గ్యాప్ ఉంటుంది కాబట్టి అల్పాహారం తీసుకోకపోతే గ్యాస్, అసిడిటీ, నీరసం వేధిస్తాయి. రక్తంలో చక్కెర స్థాయిలు పడిపోయి పనిపై ఏకాగ్రత తగ్గుతుంది. పైగా మధ్యాహ్నం ఎక్కువగా తినడం వల్ల బరువు పెరిగే ప్రమాదం ఉంది. అందుకే ఉదయం 9 గంటలలోపు పోషకాహారంతో కూడిన అల్పాహారం తప్పక తీసుకోవాలి.