హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పేద విద్యార్థినుల ఉన్నత చదువులకు చేయూత

ATP: శెట్టూరు మండలం మాకొడికి తండాకు చెందిన బీ-ఫార్మసీ విద్యార్థిని మంజుల కళాశాల ఫీజు చెల్లింపు కోసం ఇన్ఫినిటీ చారిటబుల్ ట్రస్ట్ ఛైర్మన్ బద్దె నాయక్ రూ.30 వేల చెక్కును అందజేశారు. ఆమెతో పాటు అదే తండాకు చెందిన మరో నలుగురు విద్యార్థినుల ఉన్నత చదువులకు కూడా ట్రస్ట్ అండగా నిలుస్తోంది. ఆర్థిక ఇబ్బందులతో ఆడపిల్లల చదువు ఆగకూడదనే ఈ చేయూత అందిస్తున్నామన్నారు.