కోనసీమ: రానున్న గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో సమస్యాత్మక గ్రామంగా గుర్తించిన చిందాడగరువులో అమలాపురం పట్టణ పోలీసులు సోమవారం రాత్రి ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు. సీఐ పి.వీరబాబు ఆధ్వర్యంలో భారీ సంఖ్యలో పోలీసు సిబ్బంది ఈ కవాతులో పాల్గొన్నారు. ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా ప్రజల్లో భరోసా కల్పించడంతో పాటు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు చర్యలు చేపట్టారు.
ఆంధ్రప్రదేశ్
పోలీసుల ఫ్లాగ్ మార్చ్.. ఎన్నికల వేళ భద్రత కట్టుదిట్టం


