NLR: జిల్లాలో ఈ నెల 26న జరగనున్న తొలిదశ పంచాయతీ ఎన్నికలకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఉదయం 7 నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు పోలింగ్ నిర్వహించి అనంతరం ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. మొదటి దశలో 8 మండలాల్లోని 184 పంచాయతీలు, 1,882 వార్డులకు ఎన్నికలు జరగాల్సి ఉండగా, 20 పంచాయతీలు, 393 వార్డులు ఏకగ్రీవమయ్యాయి.
ఆంధ్రప్రదేశ్
తొలిదశ పంచాయతీ ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తి


