హైదరాబాద్: 28°C
ఆరోగ్యం

చర్మం రోజంతా ఫ్రెష్‌గా మెరవాలా?

చర్మం రోజంతా తాజాగా, కాంతివంతంగా ఉండాలంటే ఉదయం సరైన స్కిన్ కేర్ పాటించడం ముఖ్యం. ముఖాన్ని మరీ వేడి నీటితో కాకుండా గోరువెచ్చని లేదా చల్లని నీరు, మైల్డ్ క్లెన్సర్‌తో శుభ్రం చేసుకోవాలి. తడి ఆరకముందే చర్మ తత్వానికి సరిపడే మాయిశ్చరైజర్ రాసుకోవడం వల్ల తేమ నిలిచి ఉంటుంది. ఆపై సన్‌స్క్రీన్ అప్లై చేస్తే దుమ్ము, ఎండ నుంచి చర్మానికి పూర్తి రక్షణ లభిస్తుందని సౌందర్య నిపుణులు చెబుతున్నారు.