హైదరాబాద్: 28°C
ఆరోగ్యం

కాళ్లలో నరాలు ఉబ్బి నొప్పిగా ఉంటున్నాయా?

కాళ్ల సిరల్లో వాల్వ్‌లు బలహీనపడి రక్త ప్రసరణ సరిగ్గా జరగకపోతే వెరికోస్ వెయిన్స్ వస్తాయి. దీంతో నరాలు ఉబ్బి, మెలికలు తిరిగి నీలం లేదా ఊదా రంగులో కనిపిస్తాయి. ఎక్కువసేపు నిలబడటం, అధిక బరువు, కదలిక లేకపోవడం దీనికి ప్రధాన కారణాలు. కాళ్ల నొప్పి, వాపు, తిమ్మిర్లు దీని లక్షణాలు. రోజూ నడక, బరువు తగ్గడం, కాళ్లను ఎత్తుగా ఉంచడం ద్వారా ఉపశమనం పొందవచ్చు. సమస్య తీవ్రమైతే వైద్యుడిని సంప్రదించాలి.