హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: ఆలయంలో కార్తీక దీపోత్సవం

SRD: ఖేడ్ మండలం సంజీవనరావుపేట గ్రామంలోని శ్రీ లక్ష్మీ అనంత పద్మనాభ స్వామి ఆలయ ప్రాంగణంలో మంగళవారం రాత్రి కార్తీక దీపోత్సవం అత్యంత వైభవంగా జరిగింది. పర్వదినాన్ని పురస్కరించుకుని వందలాది సంఖ్యలో మహిళలు ఆలయానికి తరలివచ్చి, భక్తిశ్రద్ధలతో ప్రమిదలు వెలిగించి ప్రత్యేక దీపారాధన చేశారు. వేలాది దీపాల వెలుగుల్లో ఆలయ ఆవరణంతా ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది.