హైదరాబాద్: 28°C
తెలంగాణ

అగ్నిప్రమాదంలో మొక్కజొన్న దగ్ధం

VKB: పూడూరు మండలం చిలాపూర్‌లో మంగళవారం అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. పంటచేనులో కోసి ఆరబెట్టిన మొక్కజొన్నకు ప్రమాదవశాత్తు మంటలు అంటుకోవడంతో రెండు లారీలకు సరిపడా పంట దగ్ధమైంది. ఈ ఘటనతో రైతులకు భారీ నష్టం వాటిల్లింది. ప్రభుత్వం స్పందించి నష్టపోయిన రైతులను ఆదుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు.