RR: షాద్నగర్ పట్టణంలోని కిషన్ నగర్ రోడ్డులో ఉన్న కాశీ విశ్వేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలో కార్తీక పౌర్ణమి సందర్భంగా లక్ష దీపోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. వేద మంత్రోచ్ఛారణల నడుమ వేలాది దీపాలు వెలిగించడంతో ఆలయ ప్రాంగణం ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ బసవేశ్వర్, అర్చకులు, భక్తులు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
తెలంగాణ
షాద్నగర్లో వైభవంగా లక్ష దీపోత్సవం


