హైదరాబాద్: 28°C
తెలంగాణ

డిఫెన్స్ మద్యం బాటిళ్లు స్వాధీనం

HYD: సైబరాబాద్ ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ బృందం 17 డిఫెన్స్ మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకుని ఇద్దరిని అరెస్ట్ చేసింది. సైనాథ్ గౌడ్ వద్ద ఏడు బాటిళ్లు స్వాధీనం చేసుకోగా, అతను ఇచ్చిన సమాచారంతో చంద్రమోహన్ రెడ్డి ఇంట్లో మరో పది బాటిళ్లను గుర్తించారు. టీచర్స్, బ్లాక్ అండ్ వైట్, అమృత్ బ్రాండ్ల మద్యాన్ని స్వాధీనం చేసుకుని నిందితులను కొంపల్లి ఎక్సైజ్ పోలీసులకు అప్పగించారు.