హైదరాబాద్: 28°C
తెలంగాణ

ధాన్యం కొనుగోలులో నిర్లక్ష్యం వద్దు..డీసీఓ

కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండలం కృష్ణాజివాడి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని మంగళవారం డీసీఓ రామ్మోహన్ పరిశీలించారు. రైతులకు ఇబ్బందులు కలగకుండా ధాన్యాన్ని వెంటనే తూకం వేసి గోదాములకు తరలించాలని ఆదేశించారు. విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.గోదాం నిర్వాహకుల నుంచి ఏవైనా ఇబ్బందులు ఎదురైతే తన దృష్టికి తీసుకురావాలన్నారు.