హైదరాబాద్: 28°C
తెలంగాణ

మల్యాలలో వైభవంగా శ్రీ వెంకటేశ్వర స్వామి రథోత్సవం

SRCL: చందుర్తి మండలం మల్యాల గ్రామంలో కార్తీక పౌర్ణమి సందర్భంగా శ్రీ కల్యాణ వెంకటేశ్వర స్వామి రథోత్సవం వైభవంగా నిర్వహించారు. స్వామివారిని రథంపై అలంకరించి గ్రామ పురవీధుల గుండా ఊరేగించారు. మహిళలు మంగళహారతులు, ముత్యాల తోరణాలతో రథయాత్రలో పాల్గొని భక్తిశ్రద్ధలతో స్వామివారికి స్వాగతం పలికారు. గ్రామ ప్రజలు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గోన్నారు.