BHPL: కార్తీక పౌర్ణమి సందర్భంగా గోరికొత్తపల్లి మండలం నిజాంపల్లి రామాలయంలో ప్రత్యేక పూజలు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. సోమవారం సాయంత్రం ఆలయ ప్రాంగణంలో మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని వివిధ రకాల పూలు, దీపాలతో నేలపై శివలింగాన్ని అందంగా అలంకరించారు. భక్తిపాటల నడుమ పూజలు నిర్వహించారు. సర్పంచుల ఫోరం అధ్యక్షురాలు సునీత-రవీందర్, మహిళలు ఉన్నారు.
తెలంగాణ
దీపాలతో నేలపై అందమైన శివలింగం


