హైదరాబాద్: 28°C
వార్తలు

కేంద్రం తీరుపై రాజీవ్ శుక్లా విమర్శలు

పార్లమెంట్ శీతాకాల సమావేశాల నిర్వహణ ఆలస్యంపై కాంగ్రెస్ ఎంపీ రాజీవ్ శుక్లా స్పందించారు. సమావేశాలు ఎప్పుడు మొదలవుతాయో బీజేపీ ఎంపీలకే తెలియదని అన్నారు. గత వర్షాకాల సమావేశాలు అధికారికంగా ముగియకపోవడంతో ఎప్పుడైనా భేటీ కావచ్చునని తెలిపారు. ప్రభుత్వంలోని కొందరికి మాత్రమే ఈ విషయం తెలుసని పేర్కొన్నారు. చరిత్రలో ఇలా ఆలస్యం ఇదే తొలిసారని విమర్శించారు.