హైదరాబాద్: 28°C
వార్తలు

పాక్ వెబ్ సిరీస్ మనకొద్దు.. ప్రధానికి లేఖ

'నెట్‌ఫ్లిక్స్ ఇండియా'లో డిసెంబర్ 4న 'జో బచాయ్ హై సంగ్ సమైత్ లో' అనే పాకిస్తానీ వెబ్ సిరీస్ విడుదల కానుంది. దీనిని నిషేధించాలని కోరుతూ AICWA ప్రధాని మోదీకి లేఖ రాసింది. ఈ సిరీస్‌ను భారత్‌లో విడుదల చేయకుండా చూడాలని AICWA అధ్యక్షుడు సురేష్ శ్యామ్‌లాల్ గుప్తా కోరారు. ఉగ్రవాదాన్ని ప్రోత్సహించే దేశానికి చెందిన కంటెంట్‌ను భారతీయ స్క్రీన్‌లపై అనుమతించకూడదని తెలిపారు.