NZB: ఆర్మూర్ మండలం అంకాపూర్ గ్రామాన్ని ట్రైనీ ఐఏఎస్, ఐఆర్ఎస్, ఐఎఫ్ఎస్ అధికారుల బృందం క్షేత్రస్థాయిలో సందర్శించింది. గ్రామంలో నూనెగింజలు, పసుపు, కూరగాయల సాగుతో పాటు డ్రిప్ ఇరిగేషన్ విధానాలను పరిశీలించింది. వ్యవసాయ అధికారి హరికృష్ణ పంటల మార్పిడి, విత్తనోత్పత్తి, విత్తన శుద్ధి కేంద్రం పనితీరును వివరించారు. గ్రామ వ్యవసాయ ప్రత్యేకతలు, రైతుల కృషిపై బృందం అవగాహన పొందింది.
తెలంగాణ
రైతుల కృషిని పరిశీలించిన ట్రైనీ అధికారులు


