NZB: పోలీసులు ప్రజలతో స్నేహభావంతో మెలగాలని బాన్సువాడ డీఎస్పీ విఠల్‌రెడ్డి సూచించారు. మంగళవారం నస్రుల్లాబాద్ పోలీస్‌స్టేషన్‌ను తనిఖీ చేసి కేసుల నమోదు, పరిష్కారం, పెండింగ్ సమస్యలపై ఆరా తీశారు. జాతీయ రహదారిపై ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకోవాలని, గ్రామాల్లో సీసీ కెమెరాల ఏర్పాటుపై ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. అనంతరం స్టేషన్ ఆవరణలో మొక్కలు నాటారు.
తెలంగాణ
కేసుల పరిష్కారంపై డీఎస్పీ ఆరా!


