హైదరాబాద్: 28°C
తెలంగాణ

మహిళా కాంగ్రెస్ బలోపేతానికి చర్యలు

కామారెడ్డి జిల్లాలో మహిళా కాంగ్రెస్ విభాగాన్ని బలోపేతం చేసేందుకు తగు చర్యలు తీసుకోవాలని కామారెడ్డి మున్సిపల్ మాజీ ఛైర్మన్, జిల్లా కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షుడు కైలాస్ శ్రీనివాసరావు సూచించారు. మంగళవారం జిల్లా మహిళా విభాగం అధ్యక్షురాలు ఆకుల కల్పనను ఆయన మర్యాదపూర్వకంగా కలిసి అభినందించారు. అనంతరం మాట్లాడుతూ గ్రామాల్లో నూతన కమిటీలను ఏర్పాటు చేయాలన్నారు.