హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: అఖండ జ్యోతి వెలుగుల్లో ఐనవోలు ఆలయం

HNK: కార్తీక పౌర్ణమి సందర్భంగా ఐనవోలు మండల కేంద్రంలోని శ్రీ మల్లికార్జున స్వామి దేవస్థానంలో ప్రత్యేక పూజలు ఘనంగా నిర్వహించారు. మంగళవారం ఉదయం స్వామివారికి మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం నిర్వహించగా, సాయంత్రం గ్రామంలోని ఊరగుట్టపై అఖండ జ్యోతి ప్రజ్వలన చేశారు. అనంతరం ఆలయంలో జ్వాలాతోరణం, సహస్ర దీపాలంకరణ కార్యక్రమాలు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు.