హైదరాబాద్: 28°C
తెలంగాణ

ముగిసిన విద్యుత్ శాఖ కబడ్డీ పోటీలు

ఖమ్మం సర్దార్ వల్లభభాయ్ పటేల్ స్టేడియంలో తెలంగాణ ట్రాన్స్‌కో, డిస్కంల ఆధ్వర్యంలో నిర్వహించిన ఇంటర్ సర్కిల్ కబడ్డీ టోర్నమెంట్ ఘనంగా ముగిసింది. హోరాహోరీగా సాగిన ఫైనల్‌లో వరంగల్ జట్టు నల్గొండపై విజయం సాధించి విజేతగా నిలిచింది. నల్గొండ రన్నరప్‌గా, నిజామాబాద్ మూడో స్థానంలో, ఖమ్మం ట్రాన్స్‌కో జట్టు నాలుగో స్థానంలో నిలిచాయి.