తమిళనాడులోని తిరుప్పరంకుండ్రం కొండపై కార్తీక దీపం వెలిగించే అంశంపై ఉత్కంఠ కొనసాగింది. కార్తిక పౌర్ణమి రోజున 'దీపతూన్' రాతి స్తంభంపై దీపం వెలిగించాలని సుప్రీంకోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చినా అక్కడ దీపాన్ని వెలిగించలేదు. దీనికి కొంత దూరంలో ఉచ్చిపిళ్లయార్ ఆలయం వద్ద 'మహా దీపం' వెలిగించారు. మరోవైపు సుప్రీం ఉత్తర్వులను సవాల్ చేస్తూ తమిళనాడు ప్రభుత్వం తరఫున రివ్యూ పిటిషన్ దాఖలు చేసింది.
వార్తలు
తమిళనాడులో రాతిస్తంభంపై వెలగని 'కార్తీక దీపం'


