హైదరాబాద్: 28°C
వార్తలు

కేరళ పాఠశాలలో తుపాకీ కలకలం

కేరళలోని పాలక్కాడ్ జిల్లా పాఠశాలలో నాటు తుపాకీ కలకలం సృష్టించింది. ఓ విద్యార్థి స్కూల్‌కు తెచ్చిన తుపాకీ పేలడంతో 9వ తరగతి బాలుడికి గాయాలయ్యాయి. పరుత్తూర్ ప్రభుత్వ పాఠశాలలో ఈ ఘటన జరిగింది. దీంతో గాయపడిన బాలుడిని కొట్టక్కల్ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసిన పోలీసులు తుపాకీ ఎక్కడి నుంచి వచ్చిందనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.