హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నేటి నుంచి బార్లు, వైన్ షాపులు బంద్

NDL: స్థానిక ఎన్నికల నేపథ్యంలో మంగళవారం సాయంత్రం ఐదు గంటల నుంచి 26వ తేదీ రాత్రి 7గంటల వరకు బార్లు, మద్యం దుకాణాలను మూసివేస్తున్నట్లు నంద్యాల జిల్లా ఎక్సైజ్ సూపరింటెండెంట్ రవికుమార్ తెలిపారు. ఆయన మాట్లాడుతూ ఎన్నికలు జరుగుతున్న మండలాల్లో అమలులో ఉంటుందన్నారు. 8 మంది ఎస్సైలు, 32 మంది పోలీస్ కానిస్టేబుల్ ప్రత్యేక విధుల్లో ఉంటారని చెప్పారు.