హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

9 నెలల చిన్నారికి వరల్డ్ రికార్డ్

VZM: జిల్లాకు చెందిన 9 నెలల చిన్నారి వరల్డ్ రికార్డ్ సాధించింది. కొత్తవలసకు చెందిన నవీన్‌కుమార్, ప్రిషిల్లా దంపతుల కుమార్తె కోట అవీషి లియానా 'బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్'లో స్థానం దక్కించుకుంది. చిన్న వయసులోనే చురుగ్గా కదలడం, బొమ్మలను గుర్తించి తీసుకురావడం, సూచనలకు వేగంగా స్పందించడంలో అసాధారణ ప్రతిభ కనబరిచింది.