హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

28న నవోదయ ప్రవేశ పరీక్ష

VZM: ఉమ్మడి విజయనగరం జిల్లా వ్యాప్తంగా ఈ నెల 28న శనివారం ఆరో తరగతి ప్రవేశానికి జవహర్ నవోదయ విద్యాలయ పరీక్ష నిర్వహించనున్నారు. మొత్తం 7,508 మంది విద్యార్థులకు హాల్‌టికెట్లు జారీ చేసినట్లు ఇంఛార్జ్ ప్రిన్సిపల్ కేశవ ప్రసాద్ తెలిపారు. జిల్లాలో 43 కేంద్రాల్లో ఉదయం 11.30 నుంచి మధ్యాహ్నం 1.30 గంటల వరకు పరీక్ష జరుగుతుందన్నారు.