హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

విశ్రాంత ఫారెస్ట్ అధికారి కారుకు నిప్పు

KRNL: ఉలిందకొండ పరిధిలో విశ్రాంత ఫారెస్ట్ అధికారి నసీరుద్దీన్(74) కారును గుర్తుతెలియని వ్యక్తులు దగ్ధం చేశారు. తన భూమిలో అక్రమ రహదారి నిర్మాణాన్ని అడ్డుకున్నందుకే కక్షసాధింపునకు పాల్పడ్డారని బాధితుడు ఆరోపించారు. గతంలో ప్రాణహాని ఉందని ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. నలుగురిపై కేసు నమోదు చేసి విచారిస్తున్నట్లు వెల్లడించారు.