హైదరాబాద్: 28°C
తెలంగాణ

రేపు ఐదు గ్రామాల్లో ఇందిరమ్మ బీమా గ్రామసభలు

KMR: మద్నూర్ మండలంలోని చిన్న షక్కర్గ, లచ్చన్, హెచ్.కేలూర్, సుల్తాన్‌పేట్, పెద్ద తడగూర్ గ్రామాల్లో రేపు ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమాపై గ్రామసభలు నిర్వహించనున్నట్లు కాంగ్రెస్ మండల అధ్యక్షుడు ధరాస్ సాయిలు మంగళవారం తెలిపారు. రేషన్ కార్డు కలిగిన అర్హులందరూ సభలకు హాజరై కుటుంబ యజమాని, నామినీ పేర్లను నమోదు చేసుకోవాలని కోరారు.