దేశ భద్రత దృష్ట్యా భారత సైన్యం కీలక నిర్ణయం తీసుకుంది. సైనికులు, రక్షణ శాఖ అధికారులు తమ ఫోన్లలో 87 రకాల యాప్‌లను వినియోగించకూడదని ఆదేశాలు జారీ చేసింది. ముఖ్యంగా సోషల్ మీడియా, డేటింగ్, గేమింగ్ యాప్స్ అస్సలు వినియోగించకూడదని పేర్కొంది. వీటి ద్వారా శత్రు దేశాల నిఘా సంస్థలు మన దేశానికి సంబంధించిన కీలక వివరాలను సేకరించే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేసింది.
వార్తలు
సైనికుల ఫోన్లలో 87 యాప్‌లపై నిషేధం


