E.G: రానున్న మూడు గంటల్లో ఉమ్మడి గోదావరి జిల్లాలో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఉరుములు, మెరుపులతో పాటు గంటకు 40-50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని హెచ్చరించింది. ఇప్పటికే పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తుండటంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.
ఆంధ్రప్రదేశ్
ఉమ్మడి గోదావరి జిల్లాకు వర్ష సూచన


