హైదరాబాద్: 28°C
తెలంగాణ

22ఏ నిబంధన తొలగించాలి: ఎమ్మెల్యే

RR: బడంగ్‌పేట్ సర్కిల్ పరిధిలోని పలు కాలనీల్లో ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి పర్యటించి స్థానికుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అల్మాస్‌గూడలో రూ.80 లక్షలతో డ్రైనేజీ, రూ.1.20 కోట్లతో రోడ్డు పనులు చేపడుతున్నట్లు వెల్లడించారు. ఏళ్లుగా నివాసముంటున్న కాలనీవాసులను ఇబ్బందులకు గురిచేస్తున్న 22ఏ నిబంధనను ప్రభుత్వం వెంటనే తొలగించి బాధితులకు న్యాయం చేయాలని ఈ సందర్భంగా కోరారు.