హైదరాబాద్: 28°C
వార్తలు

సోనియా గాంధీకి లీగల్ నోటీసులు

కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ తన పుస్తకంలో వీర సావర్కర్‌పై అభ్యంతకర వ్యాఖ్యలు చేశారంటూ ఆయన మునిమనవడు సత్యకి సావర్కర్ ఆమెకు లీగల్ నోటీసులు పంపించారు. ఆ పుస్తకంలో ఆమె చేసిన వ్యాఖ్యలు సావర్కర్ పరువుకు నష్టం కలిగించేలా ఉన్నాయని ఆరోపించారు. 15 రోజుల్లో బేషరతుగా క్షమాపణ చెప్పడంతో పాటు వ్యాఖ్యలపై వివరణ ఇవ్వాలని, అలాగే తప్పులను సరిదిద్దాలని డిమాండ్ చేశారు.