హైదరాబాద్: 28°C
వార్తలు

పంజాబ్‌ను డ్రగ్స్ రహిత రాష్ట్రంగా చేస్తాం: అమిత్ షా

శిరోమణి అకాలీదళ్ తిరిగి ఎన్డీఏలో చేరటం సంతోషంగా ఉందని కేంద్రమంత్రి అమిత్ షా వెల్లడించారు. త్వరలోనే ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. నషా ముక్త్ పంజాబ్ అని గతంలో ఆప్ అధినేత కేజ్రీవాల్ చెప్పారని.. కానీ ఆ హామీ నిలబెట్టుకోలేకపోయారని విమర్శించారు. పంజాబ్‌ను డ్రగ్స్ రహిత రాష్ట్రంగా చేస్తామని హామీ ఇచ్చారు. ఎన్డీఏ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు.