హైదరాబాద్: 28°C
భక్తి

కార్తీకదీపం వివాదం.. సర్వత్రా ఉత్కంఠ

తమిళనాడులోని తిరుప్పరంకుండ్రం కొండపై కార్తీకదీపం వివాదం కొనసాగుతోంది. ఇప్పటికే కొండపై కార్తీకదీపం వెలిగించేందుకు సుప్రీంకోర్టు అనుమతినిస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. దీన్ని సవాల్ చేస్తూ తమిళనాడు ప్రభుత్వం రివ్యూ పిటిషన్ దాఖలు చేసింది. దీంతో కొండపై దీపం వెలిగిస్తారా?.. లేదా? అనే దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. మరోవైపు ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా కొండ వద్ద 7 వేల మంది పోలీసులను మోహరించారు.