హైదరాబాద్: 28°C
తెలంగాణ

ప్రయాణికులకు రైల్వే శాఖ గుడ్‌న్యూస్

HYD: పండుగ వేళ ప్రయాణికుల రద్దీని తగ్గించేందుకు దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేసింది. చర్లపల్లి-రక్సౌల్ మధ్య ఈ నెల 25, 27 తేదీల్లో సర్వీసులు నడపనున్నట్లు ప్రకటించింది. రైళ్ల సమయాలను CPRO శ్రీధర్ వెల్లడించారు. 05527 రైలు బుధవారం సాయంత్రం 4:55 గంటలకు, 05528 రైలు శుక్రవారం రాత్రి 10 గంటలకు బయలుదేరుతాయని తెలిపారు.