KNR: తిమ్మాపూర్ మండలంలోని గన్నేరువరం ఎంజెపి పాఠశాలలో జూనియర్ విద్యార్థిపై ఆరుగురు సీనియర్ విద్యార్థులు దాడి చేసి గాయపరిచిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ నెల 17న జరిగిన ఘటనపై బాధిత విద్యార్థి తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు సిద్ధమవగా, ఉపాధ్యాయుల హామీతో వెనుదిరిగారు. దాడికి పాల్పడిన ఆరుగురు విద్యార్థులపై క్రమశిక్షణ చర్యలు తీసుకుని ఇంటికి పంపించినట్లు పాఠశాల వర్గాలు తెలిపాయి.
తెలంగాణ
ఎంజెపిలో జూనియర్‌ను చితకబాదిన సీనియర్లు..!


